sUrIDu vachchinDu - సూరీడు వచ్చిండు
చిత్రం : ఓనమాలు(OnamAlu) (2012)రచన : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : కోటి, బృందం
19 July - నేడు రాజేంద్రప్రసాద్ బర్త్‌డే
(rAjendra prasAd birth day)
పల్లవి :
సూరీడు వచ్చిండు సూడయ్యో... ఓ...
సూరీడు వచ్చిండు సూడయ్యో
ఎలుగు సూదుల్ని తెచ్చిండు సూడయ్యో॥
ఏమారి తొంగున్న సోమరి రెప్పల్ని
సుర్రున గిచ్చిండు సూడయ్యో
సుర్రుసుర్రున గిచ్చిండు సూడయ్యో
నింగి కర్రి రంగు ఇరిగింది
బంగారు నీరల్ల్లే కరిగింది (2)
నీరెండ సినుకుల్నే కురిసింది...
నీరెండ సినుకుల్నే కురిసింది
పల్లె ముంగిట్లో ముగ్గుల్ని ఏసింది (2)
చరణం : 1
కొండెనక కులికేటి అగ్గిరాజుని
ఆడి సందెపెళ్లాం వచ్చి గిల్లిందా
ఇంత కాంతి కళ్లాపిని జల్లిందా॥
బుట్ట కింది కోడిపుంజు రెక్కను దువ్వి (3)
కొక్కోరొక్కో కొక్కోరొక్కోమని
కొక్కొరొక్కొక్కొరొక్కోమని
ఎక్కిరించమని పంపిందా
ఆడ్ని కొక్కిరించమని పంపిందా
చరణం : 2
ఓయ్ కొండల్లో కొలువున్న కనకరాశిని
ఎండ కొలిమి తాకి ఎలికి రమ్మని
వేకువొచ్చి వెన్నుతట్టి లెమ్మని ॥
బువ్వ పెట్టే భూమి తల్లి సేవనుజేసి (3)
బతుకంతా పచ్చంగ పండించుకోమని
హెచ్చరించినాడు లెండయ్యో
ఆడి ముచ్చటాలకించ రండయ్యో॥
Onamalu Songs - Sureedu - Rajendra Prasad -...