oka pAdam mOpagaligE - ఒకపాదం మోపగలిగే
చిత్రం : రచ్చ(racha) (2012), రచన : చంద్రబోస్సంగీతం : మణిశర్మ, గానం : హేమచంద్ర, మాళవిక
పల్లవి :
ఒకపాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ॥
ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్
మై దిల్‌కీ తమన్నా (2)
హే నా... హే నా... హో
నీ కురులే కురుకురులేనా
హే నా... హే నా... హో
నీ మాటలు క్యాడ్‌బరీయేనా
హే నా... హే నా... హో
ఈ నేలకు జారిన
రెయిన్‌బో నువ్వేనా
చరణం : 1
నువ్వే నా రేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్
గాలల్లే గుండెల్లో చేరావే
చూస్తూనే శ్వాసలకే సంకెళ్లే వేశావే
నువ్వే నీ కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్
మెరుపల్లే చినుకల్లే కలిశావే
వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే
సరికొత్తగా జన్మిస్తున్నా
నిలువెత్తుగా జతకడుతున్నా
నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా
హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే రానా
హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా
హే నా... హే నా... హో
వందేళ్లకు సరిపడ సరదా అందీయనా
చరణం : 2
ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం
పక్షులకే రెక్కలనే తొడగాలే
మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే
ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం
పువ్వులకే రంగులనే పంచాలే
సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే
అరెరెరెరెరే హరివిల్లైనా అరెరరెరరే సిరిజల్లైనా
మన ఆనందానికి ఆనందించేనా
హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే కానా
హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా
హే నా... హే నా... హో
వందేళ్లకి చెరగని గురుతులు నిలిపేనా