pUlu gusagulADEnani - పూలు గుసగుసలాడేనని
చిత్రం : శ్రీవారు మావారు(SrIvAri mAvAru) (1973)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
పూలు గుసగుసలాడేనని
జతగూడేనని
గాలి ఈలలు వేసెనని
సైగ చేసేనని
అది ఈ రోజే తెలిసింది...॥
చరణం : 1
మబ్బు కన్నెలు పిలిచే నని
మనసు రివ్వున ఎగిసేనని
వయసు సవ్వడి చేసేనని
ఇపుడే తెలిసింది...॥
చరణం : 2
అలలు చేతులు సాచేనని
నురుగు నవ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని
నేడే తెలిసింది...॥
చరణం : 3
పైరు పచ్చగ ఎదిగున్నది
పల్లెపడుచుల వయసున్నది
కొత్త సొగసే రమ్మన్నది
గుండె ఝుమ్మన్నది॥