kannayyalANTi annayya - కన్నయ్యలాంటి అన్నయ్య లేని
చిత్రం : బంగారుబాబు (1973)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
కన్నయ్యలాంటి అన్నయ్య లేని
కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే
వెన్నెలెందుకు॥
చరణం : 1
నా మాటకు పలికే దేవుడు
నా మనసుకు తెలిసిన చంద్రుడు
॥మాటకు॥
అలిగాడమ్మా ఈనాడు... (2)
నా బ్రతుకే చీకటి చేశాడు (2)॥
చరణం : 2
నా ఆశలు తీర్చే తండ్రే తాను
తన ఆకలి ఎరిగిన తల్లిని నేను॥ఆశలు॥
నా కనుపాపడు పలుకని నాడు (2)
కన్నులొచ్చినా కబోదినే
నేను కన్నులొచ్చినా కబోదినే
అమ్మా... చెల్లెమ్మా... అన్నయ్యా...
కన్నమ్మలాంటి చెల్లెమ్మ ఉంటే
అన్నమెందుకు
నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతూ ఉంటే
వెన్నెలెందుకు
కన్నయ్యలాంటి అన్నయ్య ఉంటే
కన్నులెందుకు
ఆ అన్నయ్య చల్లగ నవ్వుతూ ఉంటే
వెన్నెలెందుకు॥