A rOju nA rANi - ఆ రోజు నా రాణి
చిత్రం : బృందావనం(brundAvanam) (1992)రచన : వెన్నెలకంటి, సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
08 September - నేడు మాధవపెద్ది సురేష్ బర్త్‌డే
(mAdhavapeddi surEsh Birth Day)
పల్లవి :
అనుకున్నా ఏదో నవ్వని (2)
ఈ రోజే నాకు తెలిసింది
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి
అనుకున్నా ఏదో నవ్వని (2)॥రోజే॥
చరణం : 1
ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది
ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది
ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నెలాయే వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
ఈ రోజే నాకు తెలిసింది
ఈ చిత్రాలే చేసింది లవ్వని
మధు పత్రాలు రాసింది లవ్వని ॥రోజు॥
చరణం : 2
ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ
ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆ రోజు మెరిసింది అందం చిరునామా
ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది
రాగాలు రేపింది లవ్వని
అనురాగాలు చూపింది నువ్వని ॥రోజు॥
Listen Audio Song:
aa rOju nA rANi
External Link For all Audio Songs:
Brundavanam all Audio Songs | 1 |
About MAdhavapeddi. Suresh chandra:
పూర్తి పేరు : మాధవపెద్ది సురేష్‌చంద్ర
జననం : 08-09-1951
జన్మస్థలం : తెనాలి (పెరిగింది విజయవాడ)
తల్లిదండ్రులు : వసుంధరాదేవి, నాగేశ్వరరావు
తోబుట్టువులు : అన్నయ్య కీ.శే.రమేష్ (గాయకుడు)
చదువు : బి.ఏ.
వివాహం - భార్య : 15-08-1976 - నిర్మల
సంతానం : అబ్బాయి (నాగసాయి శరత్‌చంద్ర), అమ్మాయి (నాగలక్ష్మి)
తొలిచిత్రం : హైహై నాయకా (1988)
ఆఖరిచిత్రం : నీ సుఖమే నే కోరుతున్నా (2008)
(ఇప్పటివరకు), చిత్రాలు : 56 (తెలుగు)
ఫేవరెట్స్... వాయిద్యాలు : హార్మోనియం,
ఎకార్డియన్, కీ-బోర్డు, పియానో, రాగాలు : కళ్యాణి, మోహన, రాగేశ్వరి, హిందోళ మొదలైనవి,
సంగీత దర్శకులు : పెండ్యాల నాగేశ్వరరావు
గాయనీ గాయకులు : ఘంటసాల, బాలు, సుశీల, జానకి, చిత్ర, గౌరవ పురస్కారాలు : ఉత్తమ సంగీత దర్శకునిగా భైరవద్వీపం (1994), శ్రీ కృష్ణార్జున విజయం (1996) సినిమాలకు నంది అవార్డులు, దూరదర్శన్ మేలుకొలుపు పాటలకు టీవీ నంది అవార్డు, భరతముని అవార్డులు రెండు, ఢిల్లీ తెలుగు అకాడెమీ మూడు, మద్రాస్ తెలుగు అకాడెమీ రెండు సార్లు అవార్డులతో సత్కరించాయి. ఘంటసాల, కె.వి.మహదేవన్ అవార్డులు, మరెన్నో సంగీతానికి సంబంధించిన అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : చిన్నప్పటి నుండే సంగీతం పట్ల అభిరుచి ఏర్పరుచుకున్నారు సురేష్. 1967లో విజయవాడలో ‘భావనా కళాసమితి’ లో హార్మోనియం, వాద్య కళాకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆపై చెన్నైలో కీ-బోర్డు ప్లేయర్‌గా ‘పరివర్తన’ (1975) సినిమాకి టి.చలపతిరావు దగ్గర పనిచేశారు. దాదాపు అన్ని భాషల్లో ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర 1250 సినిమాలకు పనిచేశారు. ఆకాశవాణి ‘ఏ’ గ్రేడ్ మ్యూజిక్ డెరైక్టర్‌గా ప్రశంసలు అందుకున్నారు. వందకు పైగా మెగా సీరియల్స్‌కు సంగీతం అందించారు. దేశవిదేశాలలో 3000 కు పైగా సంగీత విభావరులు నిర్వహించారు. 125 ప్రైవేటు ఆల్బమ్స్‌కు సంగీతం అందించారు. మొదటి ఆల్బమ్ ‘ఓం ఓం సాయిరాం’. 125వ ఆల్బమ్ ‘కృష్ణం వందే జగద్గురుం’. ఇందులో ఐదు తరాలకు చెందిన గాయనీ గాయకులతో పాడించారు. చాలా టీవీ ప్రోగామ్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఎంతోమంది గాయనీ గాయకులను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. సంగీతంలోనే కాదు పాకశాస్త్రంలోనూ ప్రవీ ణులు. క్యారమ్స్, షటిల్‌లో తన సత్తా చాటుకున్నారు.