Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

Emi sOdarA manasuki - ఏమి సోదరా మనసుకి

చిత్రం : తొలిప్రేమ(toli prEma) (1998), రచన : భువనచంద్ర
సంగీతం : దేవా, గానం : కృష్ణరాజ్


పల్లవి :
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్లు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయెరా॥సోదరా॥
చరణం : 1
కళ్లు తెరుచుకుంటే కలలాయే
అవి మూసుకుంటే ఎద వినదాయే
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హొటలాయే
మంచినీళ్లే ఓల్డ్ మంకు రమ్మాయే
కారు హెడ్‌లైట్సే
కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా
చరణం : 2
క్లాసు బుక్స్ యమ బోరాయే
న్యూ థాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలే యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయే
పేరెంట్సు మాట వినపడదాయే
పచ్చనోటు కూడ పేపర్
బోట్సైపోయాయే
ఏమౌతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా॥సోదరా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |