Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

tanuvukenni gAyAlainA - తనువుకెన్ని గాయాలైనా

చిత్రం : ఆడబ్రతుకు(ADa Bratuku) (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్ 22 September - నేడు పి.బి.శ్రీనివాస్ పుట్టినరోజు (P> B. Sreenivas Birth Day)


పల్లవి :
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైనా
మాసిపోదు చితిలోనైనా॥
చరణం : 1
ఆడవాళ్లు ఆడుకునే
ఆటబొమ్మ ఈ మగవాడు (2)
ఆడుకున్నా ఫరవాలేదు...
పగులగొట్టి పోతారెందుకో (2)॥
చరణం : 2
మగువలను పుట్టించావే
మా సుఖమునకే అన్నావే
అందుకే ధర తెమ్మన్నావే...
బ్రతుకే బలి ఇమ్మన్నావే (2)॥
 
External Link:
ADa bratuku VIDEO SONGS:
thanuvukenni gayalaina
preme naaku mangalyam
piliche naa madilo
kanulu palakarinchenu
kali muvvalu ghallu manenu
aaha andamu chinde
vasthade vasthade vanne
Tanuvukenni gAyAlainA Audio Song

Special Notes:
 పూర్తి పేరు : ప్రతివాది భయంకర శ్రీనివాస్(prativAdi bhayankara Sreenivas)
జననం : 22-09-1930
జన్మస్థలం : కాకినాడ, తూ.గో.జిల్లా
తల్లిదండ్రులు : శేషగిరమ్మ, ఫణీంద్రస్వామి
తోబుట్టువులు : తమ్ముడు రామానుజం,చెల్లెళ్లు సీత, చూడామణి
చదువు : బి.కాం., ఎల్.ఓ.ఎల్
వివాహం - భార్య : 24-05-1950 - జానకి
సంతానం : అబ్బాయిలు (ఫణీంద్ర, విజయరాఘవ, నందకిషోర్, రాజ గోపాల్), అమ్మాయి (సంగీత లత ). అందరూ సంగీతంలో ప్రావీణ్యులే
తొలిచిత్రం - పాట : మిస్టర్ సంపత్ (1952-హిందీ),జాతకఫలం (1954-తెలుగు) - ఏలా దిగులేలా బేల...
పాటలు : కొన్ని వేలకు పైగా (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, పంజాబీ... మొదలగునవి)
సంగీత దర్శకునిగా : మహాసాధ్వి (కన్నడం)(ఇంకా రిలీజ్ కాలేదు)
అవార్డులు : తమిళనాడు నుండి కలైమామణి, కన్నడం నుండి నడోజా అవార్డు, లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డులు, ఎన్‌టీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు.
ఇతరవిషయాలు : చిన్నప్పటి నుండే సినిమాల మీద మక్కువ పెంచుకున్నారు. చాలామంది గాయనీ గాయకులను ఇమిటేట్ చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. లతామంగేష్కర్ గొంతు అంటే ఆయనకు ప్రాణం. చాలా భక్తి ఆల్బమ్స్‌కు సంగీతం అందించారు. దాదాపు రెండున్నర లక్షల కవిత్వాలను 8 భాషలలో రాశారు. ఉర్దూలో గజల్స్, 8 భాషలలో ప్రణవం (ఓంకారం) అనే పుస్తకాన్ని రాశారు. ‘దశగీతసందేశం’ అని తల్లిదండ్రులపై చిత్ర కవిత్వం రాసి, పాడారు. ‘మెన్ టూ మూన్, మూన్ టూ గాడ్’ అనే ఇంగ్లిష్ రికార్డును ఆర్మ్‌స్ట్రాంగ్‌కు, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్‌కు పంపించారు. అందుకుగాను వారు పి.బి.శ్రీనివాస్‌ను అభినందించారు. శాస్త్రీయ సంగీతం అంటే తెలియని శ్రీనివాస్, ఈ జనరేషన్‌కు సులువుగా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి రాగాల స్వరాలకు సంబంధించి ఆరోహణ, అవరోహణలతో ‘డైమండ్ కీ’ ని రూపొందించారు. ఆయన గాత్ర మాధుర్యానికి మెచ్చి కన్నడ ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఒక తెలుగు గాయకుడికి ఇటువంటి గౌరవం దక్కడం ఇదే ప్రథమం. ఆయన మెలడీ కింగ్‌గా సంగీత అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |