Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

kODekAru chinnavADA - కోడెకారు చిన్నవాడా

చిత్రం : ముందడుగు (mundaDugu)(1958)
రచన : ఆత్రేయ, సంగీతం : కె.వి.మహదేవన్
గానం : మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి




పల్లవి :
కోడెకారు చిన్నవాడా వాడిపోనీ వన్నెకాడా (2)
కోటలోన పాగావేశావా చల్ పువ్వులరంగా
మాటతోనే మనసు దోచావా
చల్ పువ్వులరంగా
మాటతోనే మనసు దోచావా...
చింతపూలా రైకదానా
చిలిపిచూపుల చిన్నదానా (2)
కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వులరాణి
దోరవలపుల దోచుకున్నావా చల్ నవ్వులరాణి
దోరవలపుల దోచుకున్నావా...
చరణం : 1
చెట్టుమీద పిట్ట ఉంది పిట్టనోట పిలుపు ఉంది చెట్టుమీద పిట్ట ఉంది పిట్టనోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా
చల్ పువ్వులరంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా
చల్ పువ్వులరంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా...
పిలుపువిన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా (2)
తెప్పలాగా తేలుతున్నానే చల్ నవ్వులరాణి
నాకు జోడుగ నావ నడిపేవా చల్ నవ్వులరాణి
నాకు జోడుగ నావ నడిపేవా...
చరణం : 2
నేల వదిలి నీరువదిలి
నేను నువ్వును తలపుమాని (2)
ఇద్దరొకటై ఎగిరిపోదామా చల్ పువ్వులరంగా
గాలిదారుల తేలిపోదామా చల్ పువ్వులరంగా
గాలిదారుల తేలిపోదామా...
ఆడదాని మాటవింటే తేలిపోటం తేలికంటే ఆడదాని మాటవింటే తేలిపోటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంట చల్ నవ్వులరాణి
మునుగుతుంటే నవ్వుతారంట
చల్ నవ్వులరాణి
మునుగుతుంటే నవ్వుతారంట...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |