Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

amarArAma - అమరారామ

చిత్రం : శిరిడిసాయి(shirdi sAi) (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి

రచన : కె.శివదత్తా
గానం : శ్వేత పండిట్


అమరారామ సుమారామచరీ
కామధేను క్షీరాలతో
సాయినాథ నీ పావనమూర్తికి
అభిషేకం క్షీరాభిషేకం (2)

సురకల్పలతా సురభిళ సుమాల
సురుచిర సుమధుర
మకరందంతో
సాయినాథ నీ మంగళమూర్తికి
అభిషేకం మధురాభిషేకం (2)

మలయమై ధర శిఖరవనాంతర
చందన సుఖ శీతల గంధంతో
సాయినాథ నీ సుందరమూర్తికి
అభిషేకం చందనాభిషేకం (2)

శ్రీహరి పదరాజీవ సముద్భవ
గగన గంగ పావన శ్రీకరముల
సాయినాథ నీ శ్రీకరమూర్తికి
అభిషేకం నీరాభిషేకం॥

మీప మహీజ సమీప ధునీగత
ఆధివ్యాధి నిరోధి ఊదిత॥మహీజ॥

సాయినాథ నీ తేజోమూర్తికి
అభిషేకం పూజాభిషేకం॥

జయహో సాయి జయం జయం
నీ పద కమలములకు
జయం జయం ॥

ఎక్కడయ్యా సాయీ - ekkaDayyA sAi

రచన : మేడిచర్ల
గానం : సునీత


ఎక్కడయ్యా సాయీ
ఎడనున్నావోయీ
కడసారి కనులారా
దర్శనమునీయి
నీలోని ఈ ఆత్మ కలిసిపోనీ
ఈ జన్మకిది చాలునోయీ
నీ ఒడిలో కనుమూయనీ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |