taladinchuku - తలదించుకు
చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Ganga toO rAmbAbu) (2012)రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, నరేంద్ర
పల్లవి :
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా
చరణం : 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
చరణం : 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాద టా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా...
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా