Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nachchAvE naizAm pOrI - నచ్చావే నైజాం పోరీ

చిత్రం : వర్షం(varsham) (2004)
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సమి, సునీతారావ్

23 October - నేడు ప్రభాస్ బర్త్‌డే(PrAbhAs Birth Day)


పల్లవి :
నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారి
హే... ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ॥
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి॥
చరణం : 1
హే... సరదాగా సరసకు చేరి
సాగిస్తా సొగసుల చోరీ
చాల్లెద్దూ మాట కచేరీ దోచేద్దూ తళుకు తిజోరీ
ముదిరావే మాయలమారి
మురిపిస్తే ఎలా మురారి
పరిచానే మల్లెపూదారి
పరిగెత్తుకు రావే పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి
వెళ్లిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి॥
చరణం : 2
హే... వరదల్లే హద్దులు మీరి
వచ్చావా తమ దయ కోరి
హే... సుడిగాలే నిలువున నిమిరి
ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరీ
హే... చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి
మబ్బుల్లో తే ల్చి ఓసారి
మైకంలో తూలి ఓసారి కౌగిళ్లో వాలి ఓ సారీ
వహ్వారే అనిపించాలి వాటేసే ప్రతిసారీ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |