Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

valapulOni chilipitanam - వలపులోని చిలిపితనం

చిత్రం : తోడు-నీడ (tODu neeDa)(1965)
రచన : ఆత్రేయ, సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి


పల్లవి :
వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టి చిక్కు అదేలే॥
చరణం : 1
కన్నులకి అల్లరి నేర్పినది ఎవ్వరు
మనసులోన జొరబడిన మగసిరి గల ధీరుడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు (2)
నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు (2)॥
చరణం : 2
తెలిసీ తెలియని మనసు తెరిచినది ఎవ్వరు
లోనికి రాగానే మూసినది ఎవ్వరు ఎవ్వరు
తీయని కలలను తినిపించినదెవ్వరు (2)
తినిపించి చిటికెలోన ఓడించినదెవ్వరు॥
చరణం : 3
చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు
వేడైన విరహంలో తోడైనదెవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు (2)
తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు (2)॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |