purivippina nemali - పురివిప్పిన నెమలి
చిత్రం : వైశాలి (2011)రచన : కృష్ణచైతన్య
సంగీతం : ఎస్.థమన్
గానం : సుచిత్ర, థమన్
పల్లవి :
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో
తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో నన్నే జోకొట్టింది
ఓ మాయా అమ్మాయా...
నువ్వే లేక లేనులే మాయా॥మాయా॥
చరణం : 1
వెలిగే దీపం సిందూరమే
మెడలో హారం మందారమే
ఎదనే తడిమెను నీ గానమే
పరువం పదిలం అననే అనను
వీచే గాలి ప్రేమే కదా
శ్వాసై గాలై చేరిందిగా
ఎదకే అదుపే తప్పిందిగా
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం॥తొలి॥॥॥మాయా॥
చరణం : 2
నాతో నాకే ఓ పరిచయం
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసింది ఒక్కో క్షణం
జగమే సగమై కరిగెనేమో
హృదయం ఉదయం నీ చూపుతో
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో ॥