Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vastunnAy vastunnAy - వస్తున్నాయ్ వస్తున్నాయ్

మరో ప్రజాప్రస్థానం
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : శ్రీకాంత్, బృందం


వచనం :
మనమందరం చేయి చేయి కలుపుదాం
ఒకటవుదాం...
ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి గారి
ఆశయాలను నెరవేరుస్తాం...
పల్లవి :
వస్తున్నాయ్ వస్తున్నాయ్ వస్తున్నాయ్ అవిగో
జన్ననాథ రథచక్రాలొస్తున్నాయ్ ఇవిగో॥
అనుపల్లవి :
దూసుకుంటూ తోసుకుంటూ
ప్రజల బాధ మోసుకుంటూ॥
ప్రేమలు పెనవేసుకుంటూ
ప్రమాణాలు చేసుకుంటూ
చరిత తిరగ రాసుకుంటూ
మరో ప్రజాప్రస్థానం సాగించుటకై
మహానేత ఆశయాలు సాధించుటకై॥
చరణం : 1
కంటి నుండి చూపును విడగొట్టే కుట్ర
గుండె నుండి ఊపిరి లాగేసే కుట్ర
నోటి నుండి ముద్దని తల్లి నుండి బిడ్డని
ప్రజల నుండి ప్రజానేతని
వేరుచేయాలని సర్కారు కుట్ర
సర్కారుతో కుమ్మక్కై ప్రతిపక్షం పన్నే కుట్ర
కుట్రలింక సాగబోవని కుతంత్రాలు గెలవలేవని
నా మాటగా చెప్పమని
తన చెల్లిని పంపాడోయ్ జగనన్న॥॥
చరణం : 2
ఆదుకొంది ఎందరినో ఆరోగ్యశ్రీ
చదివించిందెందరినో ఫీజుల మాఫీ
ప్రాణార్తుల పెన్నిధి ఒకటి సున్న ఎనిమిది
ఏమైందా ఆ పథకాల సన్నిధి
యాడుందా ఆ స్వర్ణయుగం అన్నదీ
పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది
ఎన్నాళ్లీ రాబందు రాజ్యం... ఏరేద్దాం రారా నేస్తం॥మాటగా॥॥॥
జనం వెంట జగన్ జగన్ జగన్ జగన్ జగన్
జగన్ వెంట జనం జనం జనం జనం జనం॥
చరణం : 3
చుక్క చుక్క నీటిబొట్టు సముద్రంగా మారదా
చినికి చినికి చినికి గాలి తుపాను చెలరేగదా
అడుగు అడుగు కలుస్తుంటే
భుజం భుజం కలుపుతుంటే
తిరుగులేని జన సైన్యం మనమేరా
తిరగబడితే అన్యాయం హతమేరా
అన్నదాత కంటినీరు తుడిచేదాకా పోరు జరపరా
రావాలిక రాజన్న రాజ్యం...
రైతన్నకి అదేరా స్వరాజ్యం...॥మాటగా॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |