Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

edO edO undi - ఏదో ఏదో ఉంది

చిత్రం : ఇష్క్(IshQ) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : అరవింద్-శంకర్
గానం : ప్రదీప్ విజయ్,
కళ్యాణి నాయర్




పల్లవి :
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో॥ఏదో॥
నిన్నకీ నేటికీ ఎంతగా మారెనూ
నిన్నలో ఊహలే ఆశలై చేరెనూ॥ఏదో॥
చరణం : 1
అడుగడుగునా నిన్ను కంటున్నా
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా
చివరికి నేనే నువ్వు అవుతున్నా

ఎందుకో ఈ తీరుగా మారటం
ఏమిటో అన్నింటికీ కారణం
బదులు తెలిసుండీ
ప్రశ్న అడిగేందుకే॥ఏదో॥
చరణం : 2
లోలో ఉన్నా ఊసు గుండెపెకైళ్లి
గుండెల్లోన ఊహ కళ్లపై తేలి
కళ్లల్లోన ఆశ నవ్వుపై వాలి
నవ్వులోన తల దాచుకుంటుంది
అక్కడే ఆగింది ఆ భావన
దాటితే ఏమౌనో ఏమో అనా?
ఎందుకాలస్యం ఒక్కమాటే కదా॥ఏదో॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |