Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

pilachina biguvaTarA - పిలచిన బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి (1951)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, భానుమతి

01 November - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి(dEvulapalli krishnaSAstri Birth Day)

పిలచిన బిగువటరా ఔరారా (3)
చెలువలు తామే వలచి వచ్చినా॥
భళిరా రాజా...
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవయవ్వన మాలగ నిను
నే పిలచిన బిగువటరా॥నయగారము॥
గాలుల తేలెను గాఢపు మమతలు
గాలుల తేలెను గాఢపు మమతలు
నీలపు మబ్బుల నీడలు కదలెను
అందెల రవళుల సందడి
మరి మరి (2)
అందగాడ ఇటు తొందరజేయగ
అందగాడ ఇటు తొందరజేయగ ॥
గానం :
భానుమతి
ఔనా నిజమేనా! ఔనా నిజమేనా!
మరతునన్న మరవలేని
మమతలన్నీ కలలేనా
రాణివాసమేగేవా
బావ మాట మరచేవా
ఔనా నిజమేనా! ఔనా..!
మనసులోన మరులుగొలిపి
కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లిపోయి
రాతిబొమ్మ మిగిలేనా
ఔనా నిజమేనా! ఔనా..!

ఔనా కలలేనా! ఔనా కలలేనా!
నాటి కథలు వ్యధలేనా
నీటి పైని అలలేనా (2)
బావ నాకు కరువేనా
బ్రతుకు ఇంక బరువేనా (2)
ఔనా కలలేనా!
పగ లు లేని రేయివోలె
పలుక లేని రాయివోలె
బరువు బ్రతుకు మిగిలేనా
వలపులన్నీ కలలేనా
ఔనా కలలేనా! ఔనా కలలేనా!

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |