Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

jIvamu nIvEkadA - జీవము నీవేకదా

చిత్రం : భక్తప్రహ్లాద(bhakta prahlAda) (1967)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల


పల్లవి :
జీవము నీవేకదా దేవా...
జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా...
నా భారము నీదేకదా
చరణం : 1
జనకుడు నీపై కినుక వహించీ
నను వధియింపా మదినెంచే (2)
చంపేదెవరూ సమసేదెవరూ (2)
సర్వము నీవేకదా స్వామీ... (2)
చరణం : 2
నిన్నేగానీ పరులనెరుంగా
రావే వరదా బ్రోవగ రావే
వరదా... వరదా...
అని మొరలిడగా కరివిభు గాచిన అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామివి నీవుండ
భయమేలనయ్యా ॥
చరణం : 3
హే ప్రభో... హే ప్రభో...
లక్ష్మీవల్లభ దీనశరణ్యా (2)
కరుణా భరణా కమలలోచన (2)
కన్నులవిందువు చేయగరావే (2)
ఆశ్రీత భవ బంధ నిర్మూలనా (2)
లక్ష్మీవల్లభ... లక్ష్మీవల్లభ...
చరణం : 4
నన్నే నమ్మీ నీపద యుగళీ
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా
పన్నగశయనా నారాయణా॥
చరణం : 5
మదిలో వెలిలో చీకటి మాపీ... (2)
పథము జూపే పతితపావనా (2)॥
చరణం : 6
భవజలధినిబడి తేలగలేని (2)
జీవులబ్రోచే పరమపురుషా
నను కాపాడీ నీ బిరుదమునూ
నను కాపాడీ నీ బిరుదమునూ
నిలుపుకొంటివా శ్రీతమందారా॥
చరణం : 7
విశ్వమునిండీ వెలిగే నీవే (2)
నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగనేలా
విషమునుద్రావా వెరువగనేలా
విషధర శయనా విశ్వపాలనా...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |