kanyAkumAri O - కన్యాకుమారి ఓ
చిత్రం : డమరుకం(Damarukam) (2012)రచన : సాహితి(sAhiti)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్(dEviSrI prasAd)
గానం : జాస్‌ప్రీత్ జాజ్(jAs preet jAj), సునీత(sunIta)
పల్లవి :
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ... మీనాకుమారి
నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ
వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కెర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి
రావే నీ పేరు వెనక
నా పేరు పెడతా మధుబాల
రారా నీ ముద్దుమాటకు
నా సోకులిస్తా గోపాలా
చరణం : 1
హో... నీ మీసం చూసి
మెలితిరిగెను వయ్యారం
అది తాకితే చాలు నిదరేరాని రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే సింగారం
నీ నడుమున నలిగే
మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
కళ్లతో నన్నే గారాడి చేయకు
మదనుడి మరిదివలే
కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే॥॥
చరణం : 2
హో... సూటిగ నీ చూపే నా గుండెను తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగదు ఇదివరకు
ఒంటిరి తుంటిరి తుమ్మెదలాగా అంటుకుపోకు॥॥