nuvu evvari edalO - నువు ఎవ్వరి ఎదలో
చిత్రం : మల్లీశ్వరి(mallISwari) (2004)రచన : సిరివెన్నెల(sirivellela)
సంగీతం : కోటి(kOTi)
గానం : ఎస్.పి.బాలు(S.P.bAlu)
పల్లవి :
ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు
చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ
అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికి
చరణం : 1
కలతలే కోవెలై
కొలువయే విలయమా
వలపులో నరకమే
వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవె నా నీకిదే న్యాయమా
కన్నీరు అభిషేకమా
నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే
యాగమా ప్రణయమా॥
చరణం : 2
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే
మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే
భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా
అసత్యాల గమ్యమా
నీతో పయనమే
పాపమా ప్రణయమా॥