sAi aNtE talli - సాయి అంటే తల్లి
చిత్రం : శిరిడిసాయి(Shirdi Sai) (2012)రచన : చంద్రబోస్,
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, సునీత, బృందం
పల్లవి :
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడే లేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము
నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కలమయ్యాము ॥తండ్రి॥
చరణం : 1
బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు ॥
పాటలు పాడేదెవరు
మా పొరపాటులు దిద్దేదెవరు॥
తీయగ కసిరేదెవరూ... (2)
ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి... జీవం పోసే
నువ్వే నిర్జీవుడవైనావా
నువ్వు కన్నులు తెరిచేదాకా
మా కంటికి కునుకేరాదు॥తండ్రి॥
చరణం : 2
మాకిచ్చిన నీ విబూదినే
నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతి చిన్నికర్రతో
నిన్నే తట్టి లేపేమయ్యా
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షనిఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని
ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని
ఇచ్చేవరకు ఆగలేము (2)
నువ్వొచ్చేవరకు ఊరుకోము (2)
పచ్చి మంచినీరైనా తాకబోము॥
ఓం సాయి శ్రీసాయి
జయ జయ సాయి॥సాయి॥