Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

Edi Edi kudurEdi - ఏది ఏది కుదురేది

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు(eTO vellipOyindi manasu) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా, గానం : షాన్, రమ్య

పల్లవి :
ఏది ఏది కుదురేది ఏది
ఏది ఏది కుదురేది ఏది ఎదలో (2)
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేరై నీదై ఉంటే ॥ఏది॥
చరణం : 1
నే ఓడే ఆట నీ వాదం అంటా ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతో నేనుంటే సా...
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్లై చూస్తూ ఉంటే॥ఏది॥
చరణం : 2
నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా
ఓహో నీ పాఠం నేనే
నన్నే చదివేసెయ్ అర్థం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే నాలోని నిండా నువ్వే
తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదంటే నువ్వంతా నేనైతే
మనలో నువ్వు నేను ఉంటే ॥ఏది॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |