manassE kOvelagA - మనసే కోవెలగా
చిత్రం :మాతృదేవత(mAtrudEvata) (1969)రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
పల్లవి :
మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా నన్నెన్నడు
మరువకురా కృష్ణా... ॥
చరణం : 1
కన్నీరొలికే కన్నులతో... ఆ...
నిన్నే అంతట వెదికాను (2)
ప్రతిరేయీ చీకటిగా
బ్రతుకు బరువుగా
గడిపేను॥
చరణం : 2
నా పిలుపే వినలేవా...
నా వేదన కనలేవా... (2)
నిన్నే నిన్నే తలచే నన్ను
నీ చెంతకు రమ్మనలేవా...॥