Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

parama yOgIndrulaku - పరమ యోగీంద్రులకు

చిత్రం : శిరిడిసాయి(shirdisAi) (2012)
రచన : వేదవ్యాస
సంగీతం, గానం : ఎం.ఎం.కీరవాణి


పరమ యోగీంద్రులకు
పరమ పదమందించు
పరమ పావన విష్ణుపాదం
భవబంధ రహితమై
బ్రహ్మమై భాసిల్లు
పరమ పావన విష్ణుపాదం
పరమ పావన పరబ్రహ్మ పాదం

ఘనభూమి గగనముల
కొలిచి చుంబించి
బలి దంభమణచిన
వామనుని పాదం
దివ్యమౌ భవ్యమౌ దివిజ గంగాజ లము
జాలువారిన జగన్నాథ పాదం
గుహుని గుండెల నిండి
మైత్రి పొంగించిన కులమతాతీత
రఘుకుల రామ పాదం
దశ దిశా దీపమీ పాదం
దయకు ప్రతిరూపమీ ధర్మపాదం
శరణం శ్రీవిష్ణుపాదం
శరణం శ్రీరామపాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం (2)
శరణం గురుసాయి పాదం

కపట రాక్షస వికట బహుపటాటోప
విదుషకట సువిపాటన
సుజనులపటు పాదం
కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి
తాండవమ్ముల కృష్ణపాదం
కంసాది విధ్వంస హింసావిధ్వంస
యదువంశ వరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముక్తిపాదం
ముక్కోటి దేవతల మూలపాదం॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |