Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

lAyi lAyi lAyi - లాయి లాయి లాయి

చిత్రం : ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
రచన : అనంత శ్రీరామ్, సంగీతం : ఇళయరాజా
గానం : ఇళయరాజా, బేలా షిండే


పల్లవి :
లాయి లాయి లాయి లాయి
ఈ హాయి నీదే సుమా
మాయలేవి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లాయి లాయి
ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా ॥
చరణం : 1
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో
ఎవరికి ఈ పిలుపులో
వింతవింతగా తిరిగిన ఈ మలుపులో
తన జతే నువు కలుపుకో
ఇదంతా చెప్పలేని ఈ భావనే ప్రేమ ఔనో
తెలియదు దానికి ఇక ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా॥
చరణం : 2
మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి
మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి
తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావేదో తాకిందిలాగ
గులాబిలాంటి గుండె పూసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించ దేలా
ఇలాగ ఏమనాలి ఈ లీల॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |