evariki teliyadulE - ఎవరికి తెలియదులే
చిత్రం : దొరికితే దొంగలు(dorikitE dongalu) (1965)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల
పల్లవి :
ఇంతుల సంగతి (2)
ఇంతుల సంగతి
పూబంతుల సంగతి॥
చరణం : 1
జడలో మల్లెపూల జాతర
చేస్తుంటారు (2)
బంగారు పెదవులపై
రంగులు పూస్తుంటారు (2)
ఈ సోకులన్నీ
ఇంకెవరికోసమంటారు (3)॥
చరణం : 2
ముసిముసి నగవులతో
మిసమిస చూపులతో (2)
దాచుకున్న తలపులతో
దోచుకున్న వలపులతో (2)
మొదట కసరికొడతారు
పిదప చల్లబడతారు (3)॥
చరణం : 3
పందిరి లేకుంటే
తీగ పైకి పోతుందా (2)
గోడలు లేకుంటే
గోపురమే ఉంటుందా
పురుషులు లేకుంటే
తరుణల పని గోవిందా (3)॥