endukO siggendukO - ఎందుకో సిగ్గెందుకో
చిత్రం : సిరిసంపదలు(sirisampadalu) (1962)రచన : ఆచార్య ఆత్రేయ, సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో
ఎందుకో సిగ్గెందుకో
పంతాలే తీరెనని తెలిసినందుకే
మనసులు కలిసినందుకే అందుకే సిగ్గందుకే
చరణం : 1
చిన్ననాటి చిలిపి తలపు
ఇన్నాళ్లకు వలపు పిలుపు (2)
చిరునవ్వుల చిన్నారీ... (2)
ఇంకా సిగ్గెందుకే... ఎందుకో సిగ్గెందుకో
చరణం : 2
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
తనివారగ ఈవేళ... (2)
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
చరణం : 3
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం...
అనురాగం ఆనందం అన్నీ నీకోసమే
అందుకా... సిగ్గందుకా
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే అందుకా సిగ్గందుకా
Listen to Siri Sampadalu Audio Songs at MusicMazaa.com
External Link:
EndukO siggendukO