hAyigA manakinkA - హాయిగా మనకింకా
చిత్రం : పాతాళభైరవి(pAtALabhairavi) (1951)రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.లీల
పల్లవి :
కానుకలివియే ప్రియురాలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా (2)
హాయిగా...
చరణం : 1
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా (2)
కలసి మెలసి పోదమోయ్ వలపుబాటలా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా... హాయిగా
చరణం : 2
నీ వలపూ నా వలపూ పూలమాలగా (2)
నీవు నేను విడివడనీ ప్రేమమాలగా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా... హాయిగా
చరణం : 3
కలలె నిజముకాగ కలకాలమొకటిగా (2)
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింకా స్వేచ్ఛగా (2)
హాయిగా... స్వేచ్ఛగా...(2)