kArunna mainaru - కారున్న మైనరు
చిత్రం : మైనరుబాబు(mainaru bAbu) (1973)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : టి.చలపతిరావు
గానం : పి.సుశీల
22 February - నేడు టి.చలపతిరావు వర్ధంతి
పల్లవి :
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు... హత్తెరి...॥
చరణం : 1
రోడ్డెంత బాగుంటే మీకంత హుషారు
దాన్నేసినోళ్ల మీదనే ఎక్కించి పోతారు॥
మేమెక్కి కూచుంటే మీరేమైపోతారు మేమెక్కి కూచుంటే మీరేమైపోతారు
మా పక్కనింత చోటిస్తే
చాలంటారు... హత్తెరి॥
చరణం : 2
పదునైన కన్నెపిల్ల ఎదురైతే
పళ్లికిలించి ప్రేమపాఠాలెన్నో
చెబుతారు॥
పెళ్లాడమంటేనే గొప్పోళ్లమంటారు
మా ప్రేమ ముందు
బీదోళ్లు మీరేనంటాను॥
చరణం : 3
నీ వెంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను
నా వెంట నువ్వు వచ్చావా
లోకాన్నే చూస్తావు
లోకాన్ని చూడందే
నువ్వు మనిషివి కాలేవు (2)
మావాడివైతే కలకాలం
బతికుంటావు... హత్తెరి ॥