maradalu pillA - మరదలుపిల్లా
చిత్రం : గండికోటరహస్యం(ganDikOTa rahasyam) (1969)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గడసరిపిల్లా ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా (2)॥
చరణం : 1
మొగిలిపువ్వులా సొగసుంది
ముట్టుకుంటే గుబులౌతుంది (2)
కోడెతాచులా వయసుంది
అది కోరుకుంటే దిగులౌతుంది (2)
ఆ కోపంలో భలే అందముంది (2)॥
చరణం : 2
కసురుకుంటే కవ్విస్తాను
విసురుకుంటే ఉడికిస్తాను (2)
ముక్కుతాడు తగిలిస్తాను
ఆ మూడుముళ్లు వేసేస్తాను (2)
ఏనాడైనా నీవాడనేను (2)॥
గానం : ఘంటసాల
navvenu nAlO - నవ్వెను నాలో
సాకీ :అనురాగ గగనాలలోన ఆగింది కన్నీటి వాన
మెరిసింది ఒక ఇంద్రధనువు
విరిసింది నాలోని అణువణువు
పల్లవి :
నవ్వెను నాలో జాజిమల్లి
పొంగెను నాలో పాలవెల్లి
తళతళలాడెను నా ముంగిట
ముత్యాల రంగవల్లి ॥
చరణం : 1
నా ఆశలు పులకించెనా
నా పూజలు ఫలియించెనా॥ఆశలు॥
ఆ పరమేశ్వరి చూపులు నాపై
అమృతధారలై కురిసెనా
అమృతధారలై కురిసెనా...
చరణం : 2
ఈ చీకటి విడిపోవునా
ఎలవెన్నెల విరబూయునా
చీకటి॥
నవజీవన బృందావనిలోన
నా స్వామి నను చేరునా
నా స్వామి నను చేరునా... ॥
గానం : పి.సుశీల