O chandramA - ఓ చంద్రమా
చిత్రం : విచిత్ర జీవితం (vichitra jeevitham)(1978)రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి, గానం : పి.సుశీల
03 February - నేడు చక్రవర్తి వర్ధంతి(Today Chakravarthi Death Anniversary Day)
పల్లవి :
ఒకనాటి ప్రియతమా (3)
ఈ పేద కలువ నీకు
గురుతేనా తెలుపుమా
ఓ చంద్రమా
ఒకనాటి ప్రియతమా
చరణం : 1
నీవు నాకు చేసిన బాస నీటిమీద రాసిన రాత (2)
తాళి కట్టిన కలువకన్న తళుకులొలికే తారమిన్న
రోజూ మారే రూపం నీది... (2)
మోజు పడిన పాపం నాది
ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా
చరణం : 2
కళలు మార్చి కలలే చెరిపి
మనువు మార్చి మంటలు రేపి (2)
మచ్చపడిన సొగసు నీది చిచ్చురేగిన మనసు నాది
కట్టగలవు మెడకో తాడు... (2)
కన్నె వలపుకే ఉరితాడు ॥చంద్రమా॥