Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

inkA cheppAlE - ఇంకా చెప్పాలే

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
రచన : అనంత శ్రీరామ్, సంగీతం : మిక్కీ జె. మేయర్
గానం : రాహుల్ నంబియార్, శ్వేత పండిట్


పల్లవి :
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందో వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే ఐనా నేనిలాగే నీ జాడని
కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే
ఎదురుచూపై నేనున్నా నీకే జతగా అవ్వాలనీ
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింక నువ్వే చెప్పాలే ఇంక చెప్పింక॥॥ఓ అబ్బాయి॥
చరణం : 1
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ల
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా
అంతొద్దే హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే ॥
చరణం : 2
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకాక్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే
ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్లు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు అబ్బే అబ్బే అలా అనొద్దే ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |