ASA EkASA - ఆశా ఏకాశా
చిత్రం : జగదేకవీరుని కథ(jagadEkaveeruni katha) (1961)రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత
ఆశా ఏకాశా
నీ నీడను మేడలు కట్టేశా (2)
చింతలో రెండు చింతలో
నా చెంత కాదు నీ తంతులూ
ఓయ్... చింతలో
రెండు చింతలో
నా చెంత కాదు నీ తంతులూ
చరణం : 1
ఓ... వద్దంటె కాదె ముద్దుల
బాలా ప్రేమ పరగణా రాసేశా॥
నిన్ను రాణిగా...
నిన్ను రాణిగా చేసేశా
చేతులు జోడించి మ్రొక్కేశా||ఆశా... ॥
చరణం : 2
ఓ... కోశావులేవోయి కోతలు
చాల చూశానులే నీ చేతలూ॥కోశావులేవోయి॥
రాజు ఉన్నాడూ...
రాజు ఉన్నాడూ
మంత్రి ఉన్నాడూ
సాగవు సాగవు నీ గంతులు
చింతలో... ఆ... రాజా...
మంత్రా... ఎవరూ... ఎక్కడా
రాజుగారి బూజు దులిపేస్తా
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా॥
కోటలో పాగా...
కోటలో పాగా వేసేస్తా గట్టి నీ చెయ్యి పట్టేస్తా...॥॥
Special Note:
ఆమె అసలు పేరు మహాలక్ష్మి. కర్నూలు జిల్లాలోని చాలగమర్రి గ్రామంలో మార్చి 10న, 1928లో జన్మించారు. మొదటగా హెచ్.ఎమ్.వి. కంపెనీలో పాడారు. ఆలిండియా రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు. మాయారంభ (1950)లో ‘రాత్రనక పగలనక’ పాటతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు స్వర్ణలత. గాయకులైన మాధవపెద్ది సత్యం, పిఠాపురంతో కలిసి చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. ఎన్నో పురస్కారాలతో పాటు, తమిళనాడు ప్రభుత్వం 1974 లో ‘దళపతి’ బిరుదుతో సత్కరించింది. ఆరుభాషలలో దాదాపు వేలకు పైగా పాటలు ఆలపించారు. హాస్యగీతాల స్పెషలిస్టుగా స్వర్ణలత సంగీతాభిమానుల గుండెల్లో చిరస్మరణీయం. ఆమె కుమారుడైన అనిల్‌రాజ్ ఈ మధ్యనే ‘ఆడ నేను... ఈడ నీవు’ అనే 50 పాటల సంకలనం గల సీడీని విడుదల చేశారు. అలాగే ఆమె నిజ జీవితానికి సంబంధించి ‘జీవితచరిత్ర-సినీప్రస్థానం’ అని ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఆమె పేరు మీద రెండు అనాథాశ్రమాలు కూడా నడుస్తున్నాయి.