rAmanavami - రామనవమి
చిత్రం : శిరిడిసాయి(shirdi sai) (2012)
రచన : వేదవ్యాససంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : హరిహరన్, మాళవిక, బృందం
సాకీ :
శ్రీ రామా జయ రామా...
రమణీయ నామ రఘురామా...॥రామా॥
రామనవమి చెప్పింది
రామకథా సారం (2)
శ్రీరామనవమి చెప్పింది
రామకథా సారం (2)
ఊరూ వాడా సంబరం (2)
చిందేసింది అంబరం
రామనవమి జయ రామనవమి
శ్రీరామనవమి చెప్పింది
రామకథా సారం
చరణం : 1
దశరథుని ఇంట రామరూపమున
కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి
విశ్వశాంతి విలసిల్లెను
పాదధూళితో రాయిని రమణిగా
మార్చెను మంగళధాముడు (2)
శివ ధనువు విరిచి నవ వధువును
సీతను చేరెను రాముడు
సాయి... ఆ రాముడు కొలిచిన పరమ
శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి...
రామ సాయి రామ సాయి
రామ సాయిరాం (4)
రామ రామ రామ రామ (2)॥
చరణం : 2
తండ్రి మాటకే విలువ తెలిపింది
దండకారణ్య పయనము
మాయలేడితో మలుపు తిరిగింది
మాధవదేవుని ప్రయాణము
వానరసేనలు వారధి కట్టగా
వారిధి దాటెను నరవరుడు (2)
రణ శిరమున రావణు కూర్చి
పట్టాభిరాముడాయె రఘురాముడు
సాయి... ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి
శ్రీరంగ సాయివి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే
సమర్థ సద్గురు షిరిడిసాయి॥సాయి॥॥