enta madhuraseema - ఎంత మధురసీమ
చిత్రం : దేవాంతకుడు(dEvAntakuDu) (1960)
రచన : ఆరుద్ర, సంగీతం : అశ్వత్థామగానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
పల్లవి :
సంతతము మనమిచటే...
సంతతము మనమిచటే సంచరించుదామా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 1
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై (2)
కనులముందు నిలువగా...
కనులముందు నిలువగా
నీ కురులలోన ముడిచెదనే
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 2
గగన గంగ అలలలోన
కదలియాడు తామరలే (2)
కరములందు వచ్చి చేర...
కరములందు వచ్చి చేర
నీ చరణ పూజచేయుదునా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 3
ఎటుచూచిన అందమే
చిందును మకరందమే (2)
ఈ వన్నెల వెన్నెలలో...
ఈ వన్నెల వెన్నెలలో ఓలలాడి సోలుదుమా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 4
కమ్మని ఈ వనమందున
కలసిమెలసి పాడుదమా (2)
కల్పవృక్ష ఛాయలోన...
కల్పవృక్ష ఛాయలోన కాపురమే చేయుదమా
ఎంత మధురసీమ ప్రియతమా
Download Song:
Enta madhuraseema