Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vidhi ADina ATalalOna - విధి ఆడిన ఆటలలోన

పల్లవి :

విధి ఆడిన ఆటలలోన అలసినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
ఎగసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపునది
గ్రహణాలను పిలిచినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపునది గగనాలకు సాగినది
శూన్యాలను వెతికినదా వలచే ప్రేమ


చరణం : 1

ప్రేమా నీ విలువేదమ్మా
ప్రేమా నీ చలువేదమ్మా
నిలువెల్ల విషముగ మారి చూస్తూ ఉన్నావు
ప్రేమా నీ దయలేదమ్మా
ప్రేమా నీ ప్రేమేదమ్మా
తొలిప్రేమను బలిగా కోరి
ఆడుతున్నావు
తొలివేకువ తరుణాన
మలిసంధ్యగ మారావు
కోపమా... ద్వేషమా... శాపమా...
ఆశలవంతెన పరిచావు మృత్యువు
ముంగిట నిలిపావు... ఆ... ॥

చరణం : 2

ప్రేమా నువ్వు కరుణించావా
ప్రేమా నువ్వు కనిపించావా
కలలన్నీ నిజములు చేసి గుండె నింపావు
ప్రేమా నువ్వు బ్రతికించావా
ప్రేమా నువ్వు వినిపించావా
కథలన్నీ రుజువులు చేసి ప్రేమ పంచావు
చలివెన్నెల సమయాన
చెలి చెక్కిలి తడిమావా
హాయిగా... జాలిగా... చేరగా...
జన్మకు అర్థం తెలిపావు
తీర ని ఋణమై నిలిచావు... ఆ...
విధి ఆడిన ఆటలలోన
గెలిచినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
మురిసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపినది
గ్రహణాలను చెరిపినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపినది గగనాలకు సాగినది
చైత్రాలను పిలిచినదా వలచే ప్రేమ

చిత్రం : గుడ్‌మార్నింగ్ (2012)
రచన : మౌనశ్రీమల్లిక్
సంగీతం : రవి కళ్యాణ్, గానం : దిన్‌కర్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |