madhura madhuramee - మధురమధురమీ
చిత్రం : విప్రనారాయణ (vipra nArAyaNa) (1954)
రచన : సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా, భానుమతి
16 March - నేడు సముద్రాల సీనియర్ వర్ధంతి
మరువ తగనిది ఈ హాయి॥
చరణం : 1
నవ్వుల వెన్నెల నాలో వలపుల...
నవ్వుల వెన్నెల నాలో వలపుల
కవ్వించునదే దేవీ
స్వాముల సోయగమెంచి
పులకించునదేమో రేరాణి॥
చరణం : 2
విరికన్నెలు అరవిరిసిన
కన్నుల దరహసించునో దేవీ (2)
మన అనురాగము చూసి...
మన అనురాగము చూసి
చిరునవ్వుల చిలుకును స్వామీ॥
చరణం : 3
మీ వరమున నా జీవనమే
పావనమాయెను స్వామీ (2)
ఈ వనసీమయె నీ చెలిమి... ఆ...
ఈ వనసీమయె నీ చెలిమి
జీవనమాధురి చవిచూసినదే॥