Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

ఓ ప్రియా మరుమల్లెయకన్నా - O priyA marumalleyakannA

చిత్రం : మల్లెపూవు(mallepUvu) (1978)


రచన : ఆరుద్ర
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు

14 January - నేడు శోభన్‌బాబు జయంతి
సాకీ :
చేయి జారిన మణిపూస
చెలియ నీవు
తిరిగి కంటికి కనబడితీవు గాని
చూపు చూపున తొలినాటి
శోకవన్నె రేపుచున్నావు
ఎంతటి శాపమే...
పల్లవి : ఓ ప్రియా...
మరుమల్లెయకన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది॥
మన ప్రణయం అనుకొని
మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
చరణం : 1 సఖియా...
నీవెంతటి వంచన చేశావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం (2)
నిను విడవదులే నా హృదయం॥ప్రియా॥
చరణం : 2
తొలిప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు॥
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే॥ప్రియా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |