Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vELA pALa lEdu - వేళా పాళ లేదు


చిత్రం : అభిలాష (abhilAsha) (1983)

రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
వేళా పాళ లేదు కుర్రాళ్లాటకూ
ఓడే మాట లేదూ ఆడేవాళ్లకూ
ఏది గెలుపో... హాయ్ హాయ్...
ఏది మలుపో... హాయ్ హాయ్...
తెలియువరకు ఇదే ఇదే ఆట మనకు॥పాళ॥
తకధిమి తథోంత తకధిమి తథోంత
తకధిమి తథోంత తరికిట తరికిటత
చరణం : 1
మన్మథుడు నీకు మంత్రి అనుకోకు
నీ వయసు కాచేందుకు... ఊ..
వయసు ఒక చాకు అది వాడుకోకు
నా మనసు కోసేందుకు... ఊ...
మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు
లేదనీ నీదనీ కలగని నిజమని
అనుకొని ఆడకు...
లాలా లాల లాలా లాలాలాలా॥
చరణం : 2
కలలకొక రూపు కనులకొక కైపు
తొలిమబ్బు విరిపానుపు... ఊ...
కవితలిక ఆపు... కలుసుకో రే పు
చెబుతాను తుది తీరుపు... ఊ...
అహ ఏ తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు
వద్దనీ ముద్దనీ చిదమని పెదవిని
చిటికెలు వేయకు...॥పాళ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |