nanu nItO ninu nAtO - నను నీతో నిను నాతో
చిత్రం :
గుండెల్లో గోదారి (gundellO gOdAri) (2013)రచన : అనంతశ్రీరామ్
సంగీతం : ఇళయరాజా,
గానం : భవతారిణి
పల్లవి :
నను నీలో... నిను నాలో...
చూపింది తొలిసారి
ఏమౌతావో నాకు నువ్వు
ఏమౌతానని నీకైనా నేను
అందించావు ఈ కొలువు
నీ చెలిమై నే మళ్లీ పుట్టాను ' నీతో '
చరణం : 1
ఆ వరి పైరు పరుపెయ్యేలా
గాలులు జోల పాడాలా
ఆ హరివిల్లు మన ఉయ్యాల
నిన్నే నేను ఊపాలా
ఈ చెమ్మ చుక్క చూసి
వేగుచుక్కలే ఆ నింగి నుంచి దూకి
నా కళ్లగంతలేసి కంటి లోపల
నీ నవ్వులే చూపాలా
ఊహలు ఎన్నో నాకున్నా
మరిచేనే నన్నే నేను నీ ఊసే వింటే...
నీ ఊసే వింటే ' నీతో '
చరణం : 2
మారిన ప్రాయం కోరినవన్నీ
దొరికే తీరం నువ్వేరా
ఏమిటి న్యాయం నేనొక దాన్నే
ఆశల భారం మొయ్యాలా
నీ వెచ్చనైనా సాయం
ఇచ్చి చూడమంది వెన్నలో గోదారి
ఆ వందేళ్ల నెయ్యం గుచ్చికోమంది
గుండెలోన దూరి
ఆయువు ఉన్న లేకున్నా
క్షణమైనా చాలంటాను నీతోడై ఉంటే...
నీతోడై ఉంటే... ' నీతో '