adigO adigO bhadragiri - అదిగో అదిగో భద్రగిరి
చిత్రం: శ్రీరామదాసు(SrIrAmadAsu) (2006)
సంగీతం: ఎం.ఎం.కీరవాణిరచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, బృందం
పల్లవి :
అదిగో అదిగో భద్రగిరి... ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయనికథగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకత రామపదామత వాగ్గేయ స్వరసంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి ’’అదిగో’’
చరణం : 1
రామనామ జీవన నిర్నిద్రుడు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
బందం: సాస సాని దని సానిదామ గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్ధిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడు
చరణం : 2
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటుఇటు కాగా
ధనుర్బాణములు తనువైపోగా
సీతాలక్ష్మణ సహితుడై... కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్లీ మలచి... శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే... భాగ్యమునిమ్మని కోరె భద్రుడు
చరణం : 3
వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ’’అదిగో’’