aE tIruga nanu - ఏ తీరుగ నను
చిత్రం: శ్రీరామదాసు(SrIrAmadAsu) (2006)
సంగీతం: ఎం.ఎం.కీరవాణిరచన : భద్రాచల రామదాసు (కంచెర్ల గోపన్న)
గానం : విజయ్ ఏసుదాస్, బృందం
పల్లవి :
శ్రీరఘునందన సీతారమణాశ్రీతజనపోషక రామా!
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా!
చరణం : 1
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా!
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా!
చరణం : 2
వాసవ కమలభవ సురవందిత వారధి బంధన రామా!
భాసురవర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా!
’’ఏ తీరుగ’’
బృందం: జయ జయరాం... జయ జయరాం...