Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nAku nuvvu - నాకు నువ్వు

చిత్రం : నాని(nAni) (2004)

రచన : సిరివెన్నెల
సంగీతం : ఎ.ఆర్.రహమాన్
గానం : హరిహరన్, పూర్ణిమ
03 April - నేడు హరిహరన్ బర్త్‌డే(Hariharan birthday)
పల్లవి :
ఆమె: నాకు నువ్వు నీకు నేను
ఒక్కటైతే నువ్వు నేను
లోకమంటే మనమే అందామా
అతడు: ఒక్క నువ్వు ఒక్క నేను
ఎక్కువైతే ఒప్పుకోను
ఇంతకంటే ఎందుకనుకుందామా
ఆ: ఇష్టం వచ్చినట్టు ఉందాం...
అ: తోచినట్టు చేద్దాం
ఆ: ఇష్టం వచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
అ: సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం॥నువ్వు॥
చరణం : 1
ఆ: చంటి పాపలాంటి మనసున్నవాడు
కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు
మన్మథుడి కన్నా గొప్ప అందగాడు
నా మదినే దోచేశాడు
అ: ఎవరే అంతటి మొనగాడు...
ఏడే ఎక్కడ ఉన్నాడు
వాడేనా నీ జతగాడు... వదిలేస్తావా నా తోడు
ఆ: సరిసాటిలేని ఆ మగవాడు...
ఒకడంటే ఒక్కటే ఉన్నాడు
ఇటు చూడు ఇలాగ నా కంటిపాపలో
నువ్వే ఆ ఒక్కడు ॥నువ్వు॥
చరణం : 2
అ: చందమామ సిగ్గుపడి తప్పుకొని
సిగ్గులేని జంట ఇది అనుకుని
చక్కనైన నిన్ను చూసి చుక్కలన్ని ఆకాశంలో దాక్కొని
ఆ: అందం ఉన్నది నీకోసం...
ఇందా అన్నది సహవాసం
నీతోనే నా కైలాసం... నువ్వేగా నా సంతోషం
అ: ఇంకొక్కసారిలా ఈ సత్యం...
ఒట్టేసీ చెప్పని నీ స్నేహం
సుడిగాలిలాగ చెలరేగి పోదా మరి నాలో ఉత్సాహం॥నువ్వు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |