ompula vaikhari - ఒంపుల వైఖరి
చిత్రం : ఏప్రిల్ 1 విడుదల(April 1 viDudala) (1991)
రచన : సిరివెన్నెలసంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర, బృందం
పల్లవి :
ఇంపుగ చూపవే వయ్యారి
ఆమె: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
అ: మోవినీ మగతావినీ ముడివేయనీయవా
ఆ: కాదనీ అనలేననీ గడి యైన ఆగవా
అ: అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలి
బృందం: హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలి॥
బృందం: మాంగల్యం తంతునానేన
మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదస్యకం
త్వం జీవ
శరదస్యకం... (2)
చరణం : 1
అ: కాంక్షలో కైపు నిప్పూ ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
ఆ: శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం మరయాగ వాటికా
అ: కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా॥
చరణం : 2
అ: నిష్ఠగా నిన్ను కోరీ నీయమమే దాటినా
కష్టమే సేద తీరే నేస్తమే నోచనా
ఆ: నిద్రహం నీరుగారే జ్వాలలో నించినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెత్తనా
అ: సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
ఆ: మధనమే అంతమయ్యే అమృతం అందుకో॥