chamak chamak tArA - చమక్ చమక్ తారా
పల్లవి :ఝణక్ ఝణ్ సితారా
ఆమె: చమక్ చమక్ తారా
ఝణకు ఝణ్‌సితారా
ఈ తారను విడిచిపోతారా...
అ: చమక్ చమక్ తారా
ఝణక్ ఝణ్ సితారా
నా తారను విడిచిపోతానా...
చరణం : 1
ఆ: కలల మైకములో
కనుమూసి నేనుంటే... (2)
సెలవు గైకొనకుండా తరలిపోతారా
చమక్ చమక్ తారా
ఝణక్ ఝణ్ సితారా
ఈ తారను విడిచిపోతారా...
చరణం : 2
అ: కాలికి బంధాలై
నీ అందచందాలు... (2)
క లకాలం నన్ను నీ ఖైదీ చేసేనే॥
చరణం : 3
ఆ: ఈ రాగాలు సరాగాలు ఏనాటికీ
ఇలా సాగిపోయేను ముమ్మాటికీ
అ: ఏ చోటనున్నా ఏనాటికైనా
నా చెలివి నీవే అను ఔనౌనను॥
గానం : ఘంటసాల, పి.లీల
*********
పల్లవి :
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా
అది తెలిసి మసలుకో
బస్తీ చిన్నోడా॥
చరణం : 1
బాలవయసు పెళ్లిళ్ల బాధలు
పోయాయోయ్ (2)
ప్రేమించి పెళ్లాడే
రోజులోయి వోయి ॥
చరణం : 2
చెప్పినట్లు పడి ఉండే కాలం
పోయిందోయ్ (2)
తిప్పలు పెట్టారా
తప్పవోయ్ విడాకులు॥
చరణం : 3
ఒకరి మీద ఇంకొకరు
అదుపులు మానేసి (2)
కలసిమెలసి సాగించే
సంసారం స్వర్గమోయ్ (2)॥
గానం : పి.లీల
**********
పల్లవి :
ఆమె: బైఠో ైబె ఠో పెళ్లికొడకా
అతడు: ఆల్ రైటో రైటో
నా పెళ్లికూతురా ॥ైబె ఠో॥
అడ్రస్ తెలియక అల్లాడిపోతి
అందాల పూబంతి (2)
నిను చూచినా దినం మొదలు
నే మజ్నూనైపోతినే
హాయ్... మజ్నూనైపోతినే
చరణం : 1
అయ్యో పాపమీ అవస్థ చూస్తే
గుండె నీరు కాదా (2)
వెళ్లి వెదకు నీ చెలి లైలను
ఎడారిదారుల (2)
హా... ఎడారి దారుల...
చరణం : 2
అ: లైలా లైలా... నువ్వే నా లైలా...
వలచి నన్ను దయదలచకున్న
నా తలను కోసుకుంటా (2)
తల తీసుకొన పనేలేదురా
నిన్నే చేసుకుంటా (2)
హాయ్... అదే కావాలంటా
అ: బైఠో ైబె ఠో పెళ్లికూతురా
ఆ: ఆల్ రైటో ైరె టో నా పెళ్లికొడకా
గానం : జిక్కి, జె.వి.రాఘవులు
చిత్రం : పెళ్లిసందడి (1959)
రచన : సముద్రాల రామానుజాచార్య
సంగీతం : ఘంటసాల