chinuku chinukugA - చినుకు చినుకుగా
చిత్రం : ముక్కుపుడక (mukku puDaka) (1983)
రచన : డా॥సి.నారాయణరెడ్డిసంగీతం : జె.వి.రాఘవులు, గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
పల్లవి :
అతడు: చినుకు చినుకుగా చిగురుమెత్తగా
గోరు వెచ్చగా గుండె విచ్చగా॥
ఆమె: చినుకు చినుకుగా చిగురుమెత్తగా
గోరు వెచ్చగా గుండె విచ్చగా
చరణం : 1
అ: అల్లన ఉదయించే ప్రతి కిరణం
చల్లగ చరియించే నీ చరణం
ఆ: నింగిన విహరించే ప్రతి మేఘం
పొందిన ప్రేమకు సందేశం
అ: ఊహలే ఊసులై... ఆ: ఆశలే బాసలై...
అ: హే హే... ఊహలే ఊసులై... ఆ: ఆశలే బాసలై...
అ: మధువులు చిలుకగా మధురిమలొలుకగా
ప్రణయ వేదమంత్రమేదొ పలుకగా॥
చరణం : 2
అ: వలచిన జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరింది
ఆ: కవితలకందని పలుకులలో కమ్మని దీవెన తొణికింది
అ: కడలియే గగనమై... ఆ: గగనమే కడలియై...
అ: ఆ హా... కడలియే గగనమై ఆ: గగనమే కడలియై...
ఆ: సహచరి నడకల స్వరఝరి తొణకగ
సరస రమ్య దివ్య సీమ నిలుపగ॥
Special Note:
భానుచందర్ పూర్తిపేరు మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచంద్ర ప్రసాద్. స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. పుట్టింది, పెరిగిందంతా చెన్నైలో... శకుంతలాదేవి, మాస్టర్ వేణు (ప్రముఖ సంగీత దర్శకులు) దంపతులకు రెండవ సంతానం భానుచందర్. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించారు. తెలుగులో దేశద్రోహులు, ప్రేమించొద్దు ప్రేమించొద్దు చిత్రాలకు సంగీతం అందించారు, దర్శకత్వం వహించారు.