debbaku debba - దెబ్బకు దెబ్బ
చిత్రం : రాజన్న(rAjanna) (2011)
రచన : సుద్దాల అశోక్ తేజసంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : కీరవాణి, రేవంత్
ఆపకమ్మా... పోరాటం...
కదలలేని ఊరికోసం
బానిస దండే నిప్పుల కొండై
నింగినంటేలా వెయ్...
ఊపిరి జెండా ఎగరై చావుకు
ఎదురుగ అడుగై
వె య్ వెయ్ వె య్యెహెవెయ్
సలసలసలసల మసిలే కసితో
కుతకుతకుత ఉడికే పగతో వెయ్ వెయ్
దెబ్బకు దెబ్బ
వె య్ వెయ్ వెయ్యెహెవెయ్
మన కణం కణం ఒక అగ్నికణంగా
రక్తకణం ఒక సమరగణంగా
కిరాతకీచక నీచమేచకుల శవాల తివాసి
నివాళులెత్తగ వె య్ వెయ్
వెయ్యెహెవెయ్... వెయ్ వెయ్... వెయ్యెహెవెయ్
తంతున్నా నీ కాళ్లు మొక్కనని ఏన్నాళ్లంటవురా
బంచోతన్న బాంచెన్ నని ఇక ఏన్నాళ్లుంటవురా
చరిచే కొడుకుల చండాడక ఇక ఎందుకు చూస్తవురా
క్షణం క్షణం ఇది తుది సమరంగా
గెలిపొకటే జన రణ ఫలితంగా॥వెయ్...॥
Special Notes: పూర్తి పేరు : సుద్దాల అశోక్ తేజ
జననం : 16-05-1960
జన్మస్థలం : నల్లగొండ జిల్లాలోని సుద్దాల గ్రామం
తల్లిదండ్రులు : జానకమ్మ, హనుమంతు
చదువు : ఎంఏ. బీఈడీ
వివాహం - భార్య : 13-12-1979 - నిర్మల
సంతానం : కుమార్తె (స్వప్న), కుమారులు (జ్వాలా చైతన్య, అర్జున్ తేజ)
తొలిచిత్రం-పాట : నమస్తే అన్న (1994) - గరం గరం పోరి
పాటలు : 1700 పైగా (ఇప్పటి వరకు)
నటించిన సినిమాలు : కుబుసం (2002), అడవి బిడ్డలు (2006), ఆ అయిదుగురు (చిత్రం నిర్మాణంలో ఉంది)
అవార్డులు : కంటెకూతుర్నేకను (1998)లో ‘ఆడకూతురా నీకు’, మేస్త్రీ (2009)లో ‘ఓ తల్లి నా తల్లి భరతమాత’ అనే పాటలకు నంది అవార్డులు, ఠాగూర్ (2003)లో రాసిన ‘నేను సైతం...’ పాటకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు, దళం (1996) లో ‘అవ్వనీకు దండమే’ పాటకు కళాసాగర్ అవార్డు, ఒసేయ్..! రాములమ్మా (1997)లో ‘రామసక్కని తల్లి’ పాటకు ఆత్రేయ మనస్విని అవార్డు, ఇత్యాది సాహిత్యానికి సంబంధించి దాదాపు నలభై అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : చిన్నప్పటి నుండి సినారె రాసిన పాటలను వింటూ, ఆయనలాగ పాటలు రాయాలని ఆరవ తరగతిలోనే నిర్ణయించున్నారు సుద్దాల అశోక్ తేజ. తండ్రి సుద్దాల హనుమంతు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాకవి కావడంతో అశోక్ తేజ సాహిత్య వాతావరణంలో పెరిగారు. తల్లిదండ్రుల పేరిట ‘సుద్దాల హనుమంతు-జానకమ్మ జానపద కళాపీఠం’ అనే ఫౌండేషన్‌ను 2010లో నెలకొల్పి, డెరైక్టర్ బి,నర్సింగరావుకు, ప్రజా గాయకుడు గద్దర్‌కు, చత్తీస్‌ఘడ్‌కు చెందిన జానపద గాయని పద్మభూషణ్ తీజన్‌భాయ్‌కు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అందించారు. అంతే కాకుండా మాతృదినోత్సవం నాడు ఒక్కో ఏడాది ఒక్కో గ్రామం చొప్పున (సుద్దాల, పల్లెపాడు, బ్రాహ్మణపల్లి...) అమ్మ ఒడి పండగ (ఒక ఏడాదిలో సంతానవతులైన తల్లులకు, బిడ్డలకు నూతన వస్త్రాలతో సత్కారం) నిర్వహిస్తున్నారు.