Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

velugu rEkhalavAru - వెలుగు రేఖల వారు


చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : జిక్కి, కె.ఎస్. చిత్ర, బృందం

పల్లవి
వెలుగు రేఖల వారు
తెలవారి వచ్చి
ఎండ ముద్దులు పెట్టంగా
చిలక ముక్కుల వారు
చీకటితోనే వచ్చి
చిగురు తోరణం కట్టంగా
మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు
మందార పువ్వంటి మా బామ్మని...
అమ్మమ్మని
నోమినమ్మన్నాల్లో నోమన్నలాలో
సందమామా సందమామా
నోచే వారింటిలోన పూచే పున్నాలబంతి
సందమామా సందమామా...
పండంటి ముత్తై సందమామా
పసుపు బొట్టంత మా తాత సందమామా॥

చరణం : 1
పూచిన చెవికే చేతి కురులపై తుమ్మెదలాడే ఓలాలా... తుమ్మెదలాడే ఓలాలా
కుందిని దంచే నాతి దరువుకే
గాజులు పాడే ఓలాలా... గాజులు పాడే ఓలాలా
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా...
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాలా
ఏలాలో ఏలాలా...
ఏలాలో ఏలాలా...
దివిటీల సుక్కల్లో
దివినేలు మామా...
సందమామా సందమామా
గగనాల రథమెక్కి
దిగివచ్చి దీవించు
సందమామా సందమామా॥

చరణం : 2
ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన...
ఆరు తరముల నాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ల రాత్రి
ఆ మంచమే పెంచె నీ తాత వంశం
అరవై ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి
మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి
ఇరవై ఏళ్ల వాడు మీ రాముడైతే
పదహారేళ్ల పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్లంట ముత్తై జన్మ
పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే...
మా తాతయ్య పెళ్లికొడుకాయెనే
ఆనందమానందమాయెనే...
మా నాన్నమ్మ పెళ్లికూతురాయెనే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |