alelE alelE mA - అలెలే అలెలే మా
చిత్రం : మృగరాజు(mrugarAju)(2001)
రచన : వేటూరి సుందరరామమూర్తిసంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, శైలజ, బృందం
పల్లవి :
అతడు: అలెలే అలెలే మా అలెలే మామా
బృందం: అలెలే మామా... అలెలే మామా...॥
అ: అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు సానా
ఏ... కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
హే... జున్ను ముక్క జుర్రుకుపోనా
చక్కనిచుక్కా
ఆమె: అలెలే అలెలే
మా అలెలే మామా
మొగలిపూవంటి
మొగుడోయమ్మ
మరువపు తేమ తెగమరిగిన మామా
కొరకని జామ నీ చిలకది రామా
చుక్కలొచ్చేదాకా నిన్ను ఆపేదెట్టా
ఓహో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా
చరణం : 1
అ: హే... జమాయించు
ఆ: ఓ... తమాయించు
అ: పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు
పుంజుకు పెట్టేస్తే లేత ముంజెల ముద్దిస్తా
ఆ: వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మావా జాతరకొచ్చేస్తా
అ: హే... ఒంపుసొంపు
వాగువంకై వచ్చేస్తావా
ఆ: యహ్... కట్టూ బొట్టూ
తేనెల పండూ గుచ్చేస్తావా॥
చరణం : 2
అ: హే... యమాగుంది...
ఆ: ఈ... జమాబందీ...
అ: చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా
సంతల బేరాల్లో భామా సిగ్గులు తూచేస్తా
ఆ: చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మావా చాటుగ సందిస్తా
అ: హే... రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేస్తా
ఆ: అహ... ఆటూపోటూ
అడ్డేలేని ఒడ్డే చూస్తా॥