paDavA cachchindE pillA - పడవా వచ్చిందే పిల్లా
చిత్రం : సిపాయి చిన్నయ్య (sipAyi chinnayya) (1969)
రచన : ఆచార్య ఆత్రేయసంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :అతడు: పడవా వచ్చిందే పిల్లా పిల్లా హాయ్
పడవా వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే
ఆమె: పండుగ వచ్చిందోయ్ మావా
పండూ వెన్నెల వచ్చిందోయ్
ఇద్దరూ: పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వేసిందీ
అ: పడవా వచ్చిందే పిల్లా...
చరణం : 1
ఆ: నీలి సంద్రం పొంగీ పొంగీ నింగిని రమ్మందీ హోయ్
అ: నీలాకాశం వంగీ వంగీ నీకో ముద్దంది
ఆ: నీలి సంద్రం పొంగీ పొంగీ నింగిని రమ్మందీ హోయ్
అ: నీలాకాశం వంగీ వంగీ నీకో ముద్దంది
ఆ: చిలిపి గాలి గోల చేసింది
అ: చిన్నదానికి సిగ్గూ కమ్మంది
బుగ్గా కందింది... బుగ్గా కందింది...
పడవా వచ్చిందే పిల్లా...
చరణం : 2
అ: చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్లూ (2)
పరువంలో అది ఫలించే పిల్లా వెచ్చని కౌగిళ్లూ
ఈ వెచ్చని కౌగిళ్లూ...
ఆ: అదృష్ట దేవత తెరిచెను కళ్లూ... అందరికిద్దాం భాగాలు (2)
ఈ కలిమినిచ్చినా దేవుని కాళ్లకు... రోజూ పెడదాం దండాలు
అహ... రోజూ పెడదాం దండాలు
ఇద్దరూ: పచ్చగ ఉందామూ ముద్దూ ముచ్చటగుందామా (2)
అ: పడవా వచ్చిందే పిల్లా...