okatai pOdAmA - ఒకటై పోదామా
చిత్రం : ఆస్తులు అంతస్తులు(Astulu antastulu) (1969)
రచన : ఆరుద్ర, సంగీతం : ఎస్.పి.కోదండపాణిగానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి :
ఆమె: ఒకటై పోదామా ఊహలవాహినిలో
మమతల తరగలపై మధువుల నురగలపై
పరవశమొందగా ఏకమౌదమా... ఆ...
పరవశమొందగా ఏకమౌదమా...
ఆ: ఓ... అనురాగ సీమలో అందాల కోనలో
అల్లారు ముద్దుగా ఉందామా
అతడు: సొంపైన పొదరింట ఇంపైన గిలిగింత (2)
దోబూచులాడుతూ నవ్వుకొందామా॥
చరణం : 2
ఆ: చిగురాకు జంపాల చెలరేగు చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా॥
అ: నింగిలో విహరించి నేలపై పులకించి (2)
శృంగార జలధిలో తేలుదామా॥
చరణం : 3
అ: ఓ... వలపుల జంటగా సరదాల పంటగా
సయ్యాట పాటలై సాగుదామా
ఆ: తారా చంద్రులమై... రాధాకృష్ణులమై...
తారా చంద్రులమై రాధాకృష్ణులమై
తన్మయమొందుతూ కరగిపోదామా॥